Skip to main content

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌పై శిక్షణ

సాక్షి, అమరావతి: బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా ఐడీఎస్‌ ఇన్‌కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌ ప్రోగ్రాంపై 36 గంటలు, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై 40 గంటల పాటు ఈ నెల 10 నుంచి క్లాసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈలో ఎంటెక్, బీటెక్‌ పాసైన వారు, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులూ అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 9వ తేదీలోగా www.apssdc.in  వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.
Published date : 08 Aug 2020 01:58PM

Photo Stories