Skip to main content

బీసీ హాస్టళ్లలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం

సాక్షి, అమరావతి: బీసీ హాస్టళ్లలో హ్యాపీ సండే పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ దిశగా బీసీ సంక్షేమశాఖ నెల కిందట చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో అన్ని హాస్టళ్లలో అమలు చేస్తున్నారు.

నచ్చినట్టు ఉండొచ్చు..
  • నిత్యం చదువులతో కుస్తీ పట్టి విద్యార్థులు అలసిపోతుండటం సహజం. ఈ దృష్ట్యా బీసీ హాస్టళ్లలోని విద్యార్థులు ప్రతి ఆదివారం ఆనందంగా గడిపేలా ‘హ్యాపీ సండే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
  • ఆ రోజు విద్యార్థులు వారికి నచ్చినట్లు ఉండొచ్చు.
  • నచ్చిన ఆటలాడొచ్చు.. పాటలు పాడుకోవచ్చు.
  • క్విజ్, వకృ్తత్వం పోటీలూ నిర్వహిస్తున్నారు.
  • పోటీతత్వాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు దగ్గరలో ఉన్న ఇతర హాస్టళ్ల విద్యార్థులతో ఆటల పోటీలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించారు.
  • రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 773 ప్రీ మెట్రిక్ హాస్టళ్లున్నాయి. వీటిలో 594 బాలుర, 179 బాలికల హాస్టళ్లు. వీటిలో 86,158 మంది చదువుతున్నారు.
ఫలితమిస్తోంది..
హాస్టల్ విద్యార్థులు ప్రతి ఆదివారం ఆటపాటలతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందుతున్నారని విజయవాడలోని బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు చెప్పారు. ఆయన ఏమన్నారంటే..వారంలో మిగిలిన రోజులన్నీ విద్యార్థుల్లో ఉత్సాహం ఉట్టిపడుతోంది. ఉల్లాసంగా స్కూల్స్‌కు వెళుతున్నారు.
Published date : 16 Mar 2020 04:41PM

Photo Stories