బీఎడ్‌లో 17,600 సీట్లు: డిసెంబర్ 17లోగా సర్టిఫికెట్లు అప్‌లోడ్ చెయాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీఎడ్ కోర్సుల్లో 17,600 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో 7 వర్సిటీ/ప్రభుత్వ కళాశాలల్లో 700, 3 ఎయిడెడ్ కాలేజీల్లో 350, 189 ప్రైవేటు కాలేజీల్లో 16,550 సీట్లు ఉన్నట్లు వివరించింది. ఈ సీట్లలో 13,200 కన్వీనర్ కోటా కింద, 4,400 మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల కాపీలను ఈ నెల 17లోగా అప్‌లోడ్ చేయాలంది. వాటిని ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది.
Published date : 15 Dec 2020 03:11PM