Skip to main content

ఆయుష్ కన్వీనర్ సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ కోసం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియో పతి(బీహెచ్‌ఎంఎస్), ఆయుర్వేద (బీఏ ఎంఎస్), నేచురో పతి- యోగా (బీఎన్ వైసీ), యునానీ (బీయూఎం ఎస్) కోర్సుల్లో సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలిండియా కోటాలో యూజీ ఆయూష్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులు, అదే విధంగా కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సి టీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులతో పాటు మొదటి విడ తలో సీటు పొంది కాలేజీల్లో చేరని అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in  ను చూడాలని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
Published date : 10 Feb 2021 02:58PM

Photo Stories