Skip to main content

అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అభ్యర్థులకు నియామకపత్రాలు

సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ): కృష్ణా జిల్లా నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్ నియామక పత్రాలు అందించారు.
సీఎం మాట్లాడుతూ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నింటినీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే నియామకం చేపడతామని చెప్పారు. దళారీల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా ప్రతిభ ఆధారంగా అవుట్ సోర్సింగ్ నియామకాలు చేపడుతున్నామన్నారు.

సీఎం చేతుల మీదుగా జీవో అందుకున్న వీఆర్‌ఏలు
సీఎం వైఎస్ జగన్ నిర్ణయం వల్ల ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు తమకు వచ్చాయని వీఆర్‌ఏలు ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంగళవారం వీరు జీవో కాపీలను అందుకున్నారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు మంగళవారం సీఎంని కలిశారు.
Published date : 29 Jan 2020 04:48PM

Photo Stories