అవినీతి చీడ వదిలించే బాధ్యత సివిల్ సర్వీసు అధికారులదే:వెంకయ్యనాయుడు
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: ప్రజా జీవితంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం అనేవి రాజకీయ నేతలు, అధికారులకు అత్యంత ముఖ్యమైన అంశాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.
అవినీతి చీడను పారద్రోలి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని, సుపరిపాలన ద్వారా దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధికి కృషిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వమంటే ప్రజలకు కనిపించేది అధికారుల రూపంలోనేనని చెప్పారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో అఖిలభారత సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
పేదరికం, లింగవివక్షలపై: దేశాన్ని పట్టిపీడిస్తున్నపేదరికం, నిరక్షరాస్యత, కుల, మత, లింగ వివక్షలను పారద్రోలడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పన ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఉప రాష్ట్రపతి సూచించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ కాలంలో అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. కాగా, నేటి యువత పిజ్జా,బర్గర్ వంటి పాశ్చాత్య రుచులకు ఆకర్షితులవుతోందని, ఆ ఆహారం విదేశీయులకు మంచిది తప్ప మనకు కాదని వెంకయ్యనాయుడు హితవుపలికారు. మనపెద్దలు నిర్దేశించినట్టుగా ఏ కాలానికి తగ్గట్టుగా ఆ సంప్రదాయ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు.

Published date : 08 Feb 2020 04:06PM