Skip to main content

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు!

సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మంచిరోజులు రాబోతున్నాయి.
వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. మరో రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందే అవకాశం ఉందని విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఏపీ ట్రాన్‌‌సకో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలో ఆఫీసు అటెండర్ల దగ్గర్నుంచి, సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల వరకూ దాదాపు 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి వేతనాలను కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్లకు విద్యుత్ సంస్థలు చెల్లిస్తున్నాయి. ఇందులో కమీషన్ కూడా ఉంటుంది. నేరుగా విద్యుత్ సంస్థలే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే ప్రతిపాదన తెరమీదకొచ్చింది. దీనిపై ప్రభుత్వం ఏపీ ట్రాన్‌‌సకో జేఎండీ, ఈపీడీసీఎల్ సీఎండీ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. పలు రాష్ట్రాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. రెండు నెలల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇస్తుంది. నేరుగా వేతనాలు ఇస్తే ఉద్యోగ భద్రతతో పాటు, వైద్య సదుపాయాలు అందుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంట్రాక్టర్లు.. ఇష్టానుసారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వేధించడం, తీసివేయడానికి ఆస్కారం ఉండదు.
Published date : 19 Nov 2020 01:45PM

Photo Stories