Skip to main content

ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ డిమాండ్ ఉన్న వివిధ కోర్సులకు ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఈ కోర్సులను విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు అధ్యాపకులకు ఉపయోగపడేలా ప్రముఖ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈనెల 21లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వివరాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ టోల్ ఫ్రీ నంబర్ 18004252422కు ఫోన్ చేయవచ్చని తెలిపింది.

రాస్‌బెర్రీ శిక్షణ
ఈనెల 21 నుంచి జనవరి 4 వరకు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఆన్‌లైన్ ద్వారా రాస్‌బెర్రీపై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో ఎంబెడెడ్ సిస్టమ్, సెన్సార్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్, డిస్‌ప్లే, మోటార్స్, ఎలక్ట్రికల్ సిస్టం, రోబోటిక్స్ సిస్టం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాస్‌బెర్రీ పీ బోనస్ వంటి అంశాలను తెలుసుకుంటారు. ఆసక్తి ఉన్న బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ చదివిన విద్యార్థులు, అధ్యాపకులు, రీసెర్చర్లు హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్ లింకు https://www.apssdc.in/

46 డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ
ప్రముఖ శిక్షణ సంస్థ నరేష్ టెక్నాలజీస్ సహకారంతో అధ్యాపకులు, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన, చదువుతున్న విద్యార్థులు, రీసెర్చర్లకు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఈనెల 21వ తేదీ నుంచి రాత్రి 7:30 నుంచి 9 గంటల మధ్య నాలుగు వారాలపాటు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్ డీప్ లెర్నింగ్, మిషన్
లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్, డిప్లాయింగ్ ఏఐ ఇన్ హార్డ్‌వేర్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది.
ఆసక్తి ఉన్నవారు https://www.apssdc.in/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Published date : 14 Dec 2020 03:55PM

Photo Stories