Skip to main content

ఆర్మీ ఉద్యోగాలకు సింగరేణి యువకులు..ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే..?

సాక్షి, హైదరాబాద్‌: ఆర్మీ ఉద్యోగాల కోసం సింగరేణి సంస్థ స్థానిక యువతకు ఇస్తున్న శిక్షణ సత్ఫలితాలనిస్తోంది.
గత 15 ఏళ్లుగా ఇస్తున్న శిక్షణ ద్వారా ఇప్పటివరకు 1,100 మందికి పైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మిలటరీ సేవలందిస్తుండగా, ఇటీవల మార్చి 4 నుంచి 25 వరకు హకీంపేటలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో కూడా భారీగా సింగరేణి యువత అర్హత సంపాదించారు. ఈ ర్యాలీకి హాజరైన వారిలో 96 మంది శారీరక దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగా, మెడికల్‌ పరీక్షలు ముగించుకుని 73 మంది రాతపరీక్షకు ఎంపికయినట్టు సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షుడు, జీఎం (కోఆర్డినేషన్‌ ) కె.సూర్యనారాయణ, సమితి చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ మహేశ్‌లు వెల్లడించారు. కాగా, రాతపరీక్షకు ఎంపికయిన వారిలో జనరల్‌ డ్యూటీ సోల్జర్‌ విభాగంలో 41 మంది, ట్రేడ్స్‌మెన్‌ విభాగంలో 27 మంది, నర్సింగ్‌–క్లర్కుల విభాగంలో ఐదుగురు ఎంపికయ్యారని తెలిపారు. వీరిలో ఐదుగురు కారి్మక కుటుంబాలకు చెందిన వారు కాగా, మిగిలిన వారు సమీప గ్రామాలు, పట్టణాలకు చెందిన రైతు, రైతు కూలీ కుటుంబాలకు చెందిన వారేనని తెలిపారు.

50 రోజులపాటు శిక్షణ :
ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న యువకుల కోసం సింగరేణి సంస్థ గత 15 ఏళ్లుగా ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తోంది. సింగరేణి ప్రాంతాల్లోని వేలాది మందికి ఇప్పటివరకు శిక్షణ ఇచి్చంది. అయితే, గత ఏడాది సింగరేణి సీఎండీ శ్రీధర్‌ సూచన మేరకు సింగరేణి సేవా సమితి ద్వారా 300 మంది యువకులను ఎంపిక చేసి వారికి రెసిడెన్షియల్‌ తరహా శిక్షణ ఇచ్చారు. వీరిలో 272 మంది ర్యాలీకి హాజరుకాగా, శరీర దారుఢ్య పరీక్షల్లో 162 మంది, వైద్య పరీక్షల్లో 114 మంది ఉత్తీర్ణులయి, రాతపరీక్షల్లో 35 మంది ఉద్యోగాలు సాధించారు.
Published date : 05 Apr 2021 05:32PM

Photo Stories