ఆరేళ్లుగా పదోన్నతి రాని వారికి ఒక ఇంక్రిమెంట్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలు, ప్రభుత్వంలో ఖాళీలు లేక ఆరేళ్ల వరకు పదోన్నతులు లభించని ఉద్యోగులు ఒక ఇంక్రిమెంట్ అందుకొనేందుకు వీలుగా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. 2015లో జారీ చేసిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీమ్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని కమిషన్ సిఫారసు చేసిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్ సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించారు.
Published date : 18 Jun 2021 02:01PM