Skip to main content

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రెండో విడత పరీక్షల షెడ్యూల్ ఇదే..

న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రెండో విడుత షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీట-1 టెస్ట్ జనవరి 16 నుంచి జనవరి 30 వరకు జరగనుంది. ఈ పరీక్షలో సుమారు 27 లక్షల మంది అభ్యర్థులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. పరీక్షా నగరం(సెంటర్), తేదీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం ఉచిత ట్రావెలింగ్ సర్టిఫికెట్‌ను కూడా ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్లలో నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ మోడల్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి

పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. 2వ దశలో షెడ్యూల్ చేసిన అభ్యర్థులందరికీ వారు ఆన్ లైన్ దరఖాస్తులో ఇచ్చిన ఇ-మెయిల్, మొబైల్ నంబర్లకు ఈ సమాచారాన్ని పంపనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన అభ్యర్థులకు సంబందించిన పరీక్షలను తదుపరి దశలో వెల్లడించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ పేర్కొంది. మిగతా సమాచారం కోసం ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ వీక్షించండి. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ స్టడీమెటీరియల్ కోసం క్లిక్ చేయండి
Published date : 08 Jan 2021 03:54PM

Photo Stories