Skip to main content

ఆన్‌లైన్ క్లాసులు అర్థంకాక విద్యార్థి ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం (మైలవరం): ఆన్‌లైన్ క్లాసులు అర్థంకాక మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ప్రాంతానికి చెందిన నడకుదిటి సత్యన్నారాయణ ఆదివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తన కుమారుడు ఎన్.దినేష్ (18) గొల్లపూడిలో ఓప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ క్లాసులు అర్థం కాకపోవటంతో తోటి విద్యార్థులు చులకన భావంతో చూస్తున్నారని ఈనెల 13న పురుగుల మందు తాగగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆరోగ్యం విషమించి మృతి చెందాడు.
Published date : 23 Nov 2020 02:13PM

Photo Stories