Skip to main content

అంగన్‌వాడీ సెంటర్లకు కొత్త భవనాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న కొన్నింటిలో కనీస సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ 6,000 భవనాల నిర్మాణం కోసం గత ఏడాది చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం మార్చి 17న పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి కె.దమయంతి ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 18 Mar 2020 04:56PM

Photo Stories