అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం పూర్తికి రూ.54.92 కోట్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: నాడు–నేడు కింద చేపట్టి అసంపూర్తిగా మిగిలి ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.54.92 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులిచ్చారు.
Published date : 26 Apr 2021 04:53PM