ఆంగ్ల మాధ్యమం లేక ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న విద్యార్థులు: సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్
సానుకూల చర్యల దిశగా అడుగులు...
ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరమే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగంలోనూ ఆంగ్ల మాధ్యమ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం గతేడాది ప్రారంభించింది. అయితే స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే టీచర్లు సిద్ధంగా ఉన్నారని, సరిపడా తరగతి గదులు, వసతులు ఉన్నాయని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు తీర్మానం చేసి పంపిస్తేనే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు అనుమతులు ఇస్తోంది. అయితే ఇకపై స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల తీర్మానంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేసే దిశగా అడుగుగులు పడుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో బీసీలే అత్యధికం..
రాష్ట్రంలోని సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగతా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 20,47,503 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో బీసీ విద్యార్థులే అత్యధికంగా 54.03 శాతం మంది ఉన్నట్లు ‘సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్’వెల్లడించింది. జనరల్ విద్యార్థులు 7.65 శాతం ఉంటే ఎస్సీలు 24.52 శాతం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఎస్టీలు 13.80 శాతం మంది, బీసీలు 54.03 శాతం మంది చదువుతున్నట్లు వివరించింది. మరోవైపు ఈ పాఠశాలల్లో చదువుతున్న వారిలో అత్యధికంగా బాలికలే ఉన్నారు. అందులోనూ బీసీ బాలికలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇంగ్లిష్ మీడియం స్కూళ్లపై సీఎం ఏమన్నారంటే...
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు మెచ్చుకుంటున్నారు. నేనే ఒక టీవీ ఇంటర్వ్యూలో చూశా. కూలి పని చేసుకునే మహిళ కూడా ఎంత ఖర్చయినా తమ పిల్లలను ప్రైవేటు స్కూల్‌కు పంపిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే అందులోనే చదివిస్తానని చెప్పింది. అందుకే విద్యావేత్తలు ఈ అంశాన్ని తేల్చాలి. బడ్జెట్ సమావేశాల తరువాత దీనిపై విద్యావేత్తలు, టీచర్ ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చించి ఓ విధానాన్ని రూపొందించండి. చివరగా నేను అందులో పాల్గొంటా. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై నిర్ణయం తీసు కుందాం’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
2016-17 నుంచి విద్యార్థుల వివరాలు (లక్షల్లో)..
సంవత్సరం | మొత్తం విద్యార్థులు | ప్రభుత్వ స్కూళ్లలో | ప్రైవేటు స్కూళ్లలో.. |
2016-17 | 58.67 | 28.33 | 30.34 |
2017-18 | 58.36 | 27.61 | 30.76 |
2018-19 | 58.71 | 27.49 | 31.22. |
ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో బాలబాలికలు...
కేటగిరీ | బాలురు | బాలికలు | మొత్తం | శాతం |
జనరల్ | 73036 | 83622 | 156658 | 7.65 |
ఎస్సీ | 262328 | 239801 | 502129 | 24.52 |
ఎస్టీ | 149223 | 133257 | 282480 | 13.80 |
బీసీ | 536319 | 569917 | 1106236 | 54.03 |
మొత్తం | 1020906 | 1026597 | 2047503 | 100 |
యాజమాన్యాలవారీగా పాఠశాలలు, విద్యార్థులు..
యాజమాన్యం | స్కూళ్లు | విద్యార్థులు | విద్యార్థుల శాతం |
ప్రభుత్వ | 26050 | 2047503 | 34.87 |
ఇతర ప్రత్యేక స్కూళ్లు | 82 | 4647 | 0.08 |
మోడల్ స్కూళ్లు | 194 | 124034 | 2.11 |
కేజీబీవీ | 475 | 87106 | 1.48 |
విద్యాశాఖ గురుకులాలు | 35 | 17613 | 0.3 |
సోషల్‌వెల్ఫేర్ గురుకులాలు | 237 | 106224 | 1.81 |
గిరిజన గురుకులాలు | 125 | 37242 | 0.63 |
గిరిజన ఆశ్రమ స్కూళ్లు | 1774 | 99984 | 1.7 |
బీసీ గురుకులాలు | 142 | 40938 | 0.7 |
మైనారిటీ గురుకులాలు | 205 | 46609 | 0.79 |
ఎయిడెడ్ | 678 | 98928 | 1.69 |
కేంద్ర పాఠశాలలు | 51 | 38337 | 0.65 |
ప్రైవేటు | 10549 | 3122026 | 53.18 |
మొత్తం | 40597 | 5871081 | -- |