ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో ఆన్‌లైన్ ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నందున కాలేజీల సమాచారాన్ని తమకు అందించాలని ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీలను ఆదేశించింది.
ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్ ఆయా వర్సిటీలకు లేఖలు రాశారు. ఆన్‌లైన్ ప్రవేశాలకు అనుగుణంగా గుర్తింపు పొందిన ఆయా కాలేజీల సమాచారం కోసం వర్సిటీలకు ఇంతకు ముందే ఏయే అంశాలుండాలో తెలుపుతూ ఫార్మాట్‌ను పంపించామన్నారు. అయితే.. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఆయా కాలేజీలు నేరుగా సమాచారం పంపడం కష్టం కాబట్టి ఆన్‌లైన్ ద్వారా సమాచారం సమర్పించేందుకు ఫార్మాట్‌ను రూపొందించి http://apsche.org లో లింకును పొందుపరిచామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా కాలేజీలు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వారికి ఇవి అవసరమని సూచించారు. ఆయా వర్సిటీల డీన్‌లు, సీడీసీలు, అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు అన్‌ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు ఈ సమాచారాన్ని తెలియచేయాలని కోరారు. మే 5లోగా పూర్తి సమాచారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించేలా చూడాలన్నారు. ఆ సమాచారం ఆధారంగానే ఆయా కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు.
Published date : 22 Apr 2020 03:53PM