ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్ప..?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం 2021, జూలై 23తో ముగియనుంది.
కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించే యోచనలో లేనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్త గవర్నర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నూతన గవర్నర్‌గా కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను నియమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. యడ్యూరప్పపై చాలామంది ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నన తరుణంలో ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడం బీజేపీకి అనివార్యంగా కనిపిస్తోంది. బిశ్వభూషణ్ స్థానంలో ఏపీకి గవర్నర్‌గా పంపించడం ద్వారా యడ్యూరప్పకు సముచిత స్థానం ఇచ్చినట్లవుతుందని బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది.
Published date : 19 Jun 2021 03:43PM