అంబుడ్స్‌మన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. 32 గ్రామీణ జిల్లాల్లో నియామకం..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 32 గ్రామీణ జిల్లాల్లో (జిల్లాకు ఒకరు చొప్పున) అంబుడ్‌సపర్సన్‌గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి నిర్ణీత నమూనాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది.
నెలకు రూ.33వేలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు https://nrega.telangana.gov.in/ombudsperson/ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు తెలిపారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ పథకం అమలులో వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి, తగిన ఆదేశాలు ఇచ్చేందుకు అంబుడ్‌సమన్ పర్సన్స్ ను నియమించాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు జిల్లాకు ఒకరు లేదా ఇద్దరికి మించకుండా అంబుడ్‌సమెన్‌ను నియమించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పంపించిన ప్రతిపాదనలకు అనుగుణంగా 32 మంది అంబుడ్‌సమెన్ నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిపై పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఇటీవల ఉత్తర్వులిచ్చారు.
Published date : 19 Jan 2021 04:12PM