అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశ గడువు సెప్టెంబర్ 24 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఎస్‌సీ), పీజీ (ఎంఎల్‌ఐఎస్‌సీ) కోర్సుల ప్రవేశ గడువును ఈనెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు విశ్వవిద్యాలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధిత కోర్సుల విద్యార్హతలు, ఫీజులు తదితర వివరాలను www.braouonline.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు వెల్లడించారు. మరిన్ని వివరాల కోరకు 7382929570/ 580/590/600 నంబర్లు లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-2368 0333/555 నంబర్లును సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Published date : 11 Sep 2020 02:40PM