అమ్మఒడి’కి నేటి వరకు గడువు, అవసరమైతే పొడిగింపు: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/పొగతోట (నెల్లూరు): జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులైన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మంగళవారం వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
అవసరమైతే ఈ అవకాశాన్ని మరో రెండురోజులు పొడిగిస్తామన్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈనెల 11న నెల్లూరులో ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి నెల్లూరులో అధికారులతో సమీక్షించారు. తమ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ చూసి కడుపు మంటతో ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులతోపాటు సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సభాస్థలిని పరిశీలించారు.
Published date : 05 Jan 2021 04:07PM