ఆల్ ఇండియా కోటా పీజీ వైద్య సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పీజీ వైద్య డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్ల భర్తీకి కేంద్రం మార్చి 4 (బుధవారం)నషెడ్యూల్ విడుదల చేసింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని షెడ్యూల్‌లో పేర్కొంది. మొత్తం మూడు రౌండ్లలో సీట్ల భర్తీ జరగనుంది. మూడు రౌండ్లలో చివరిదైన మాప్ అప్ రౌండ్ తర్వాత మే 27లోగా సీట్లలో చేరకపోతే వాటిని ఖాళీ సీట్లుగా గుర్తించి మే 31లోగా భర్తీ చేస్తారు. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 930 సీట్ల వరకూ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్లున్నాయి. వీటిలో 465 సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. వివరాలకు www.mcc.nic.in చూడొచ్చు.
సీట్ల భర్తీకి షెడ్యూల్ ఇలా..
సీట్ల భర్తీకి షెడ్యూల్ ఇలా..
మొదటి రౌండ్.. | |
రిజిస్ట్రేషన్/పేమెంట్ | మార్చి 12 నుంచి 22 వరకు |
సీట్ల భర్తీ, లాకింగ్ | మార్చి 16 నుంచి 22 వరకు |
సీట్ల అలాట్‌మెంట్ | మార్చి 23 నుంచి 24 వరకు |
సీట్ల ఫలితాలు | మార్చి 25న |
రిపోర్ట్ చేయాల్సిన తేదీలు | మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 |
రెండో రౌండ్.. | |
రిజిస్ట్రేషన్/పేమెంట్ | ఏప్రిల్ 7 నుంచి 12 వరకు |
సీట్ల భర్తీ, లాకింగ్ | ఏప్రిల్ 9 నుంచి 12 వరకు |
సీట్ల అలాట్‌మెంట్ | ఏప్రిల్ 13 నుంచి 14 వరకు |
సీట్ల ఫలితాలు | ఏప్రిల్ 15న |
రిపోర్టింగ్ చేయాల్సిన తేదీలు | ఏప్రిల్ 15 నుంచి 22 |
మాప్ అప్ రౌండ్.. | |
రిజిస్ట్రేషన్/పేమెంట్ | మే 12 నుంచి 17 వరకు |
సీట్ల భర్తీ, లాకింగ్ | మే 14 నుంచి 17 వరకు |
సీట్ల అలాట్‌మెంట్ | మే 18 నుంచి 19 వరకు |
సీట్ల ఫలితాలు | మే 20న |
రిపోర్టింగ్ చేయాల్సిన తేదీలు | మే 20 నుంచి 26 లోగా |
Published date : 05 Mar 2020 04:26PM