ఆక్టోపస్‌కు 117 హోంగార్డు పోస్టులు మంజూరు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలోని ఆక్టోపస్ విభాగంలో 117 హోంగార్డు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోం) కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్టోపస్ టీమ్‌కు సపోర్టింగ్‌గా ఈ హోంగార్డులు పనిచేస్తారు. వీరంతా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతకు తిరుపతి, విజయవాడల్లో విధులు నిర్వహిస్తారు.
Published date : 16 Apr 2021 04:32PM