Skip to main content

అక్టోబర్‌ 1 నుంచి ఉపకార దరఖాస్తులు... తొలుత రెన్యువల్‌ విద్యార్థులకు అవకాశం!

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల నుంచి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులు స్వీకరించేందుకు సంక్షేమ శాఖలు కసరత్తు చేస్తున్నాయి.
ప్రస్తుతం 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేసి అర్హత ఖరారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంక్షేమ శాఖలు.. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేలా కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు నూతన దరఖాస్తుల స్వీకరణ కోసం అనుమతి కోరుతూ నోడల్‌ డిపార్ట్‌మెంట్‌ అయిన ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం వారంలోగా అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రెన్యువల్‌ విద్యార్థులకు ముందుగా..
పోస్టుమెట్రిక్‌ కోర్సుల్లో రెన్యువల్‌ (సీనియర్‌) విద్యార్థులకు తొలుత ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పంచనుంది. ఈమేరకు ప్రభుత్వానికి సమరి్పంచిన ప్రతిపాదనల్లో ఎస్సీ అభివృద్ధి శాఖ పేర్కొంది. ప్రస్తుతం విద్యా సంస్థలు తెరుచుకోనప్పటికీ.. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి బోధన నిలిచిపోవద్దనే కోణంలో ఆన్‌లైన్‌ బోధన విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో అన్ని కాలేజీ యాజమాన్యాలు సీనియర్‌ విద్యార్థులతో సమన్వయం చేసుకుంటూ వారికి ఆన్‌లైన్‌ తరగతులు, అందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయా విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తుకు సిద్ధం కావాలనే అంశాన్ని వారికి సూచించారు. వచ్చేనెలలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉండటంతో ఈమేరకు సూచనలు చేయాల్సిందిగా సంక్షేమ శాఖలు సైతం యాజమాన్యాలను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ వచ్చేనెలాఖరు వరకు పూర్తి కానుంది. అనంతరం కొత్తవారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Published date : 18 Sep 2020 03:22PM

Photo Stories