Skip to main content

‘ఆక్స్‌ఫర్డ్’లో విజయవాడ విద్యార్థికి అడ్మిషన్

లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విజయవాడ నగరానికి చెందిన విద్యార్థి ఏలూరి కేతన్‌కు అడ్మిషన్ లభించింది.
నాలుగేళ్ల అప్‌లైడ్ ఫిజిక్స్ కోర్సులో చేరేందుకు నిర్వహించిన ప్రొసీజర్స్‌కు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అడ్వాన్స్ డ్ ప్లేస్‌మెంట్ పరీక్షల్లో వందశాతం స్కోర్, శాట్ సబ్జెక్ట్‌లలో 2400/2400, శాట్‌లో 1530/1600 స్కోర్లు సాధించి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో అద్భుత ప్రదర్శన ద్వారా ఈ ఘనత సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు ఫణికుమార్, హేమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోస్ట్‌మాస్టర్ కొడుక్కి రూ.కోటి స్కాలర్‌షిష్
గుంటూరుకు చెందిన పోస్ట్‌మాస్టర్ గణేశ్వరరావు కుమారుడు గుల్లిపెల్లి భార్గవ సాయికుమార్ అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైయి ఇంజనీరింగ్‌లో దాదాపు రూ.కోటి స్కాలర్‌షిప్‌తో సీటు సాధించాడు. అర్హత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఏలూరి కేతన్, జి భార్గవసాయికుమార్‌లకు శిక్షణ ఇచ్చిన ఫిట్జీ సంస్థ మేనేజింగ్ పార్టనర్ రమేష్‌బాబు వారిని అభినందించారు.
Published date : 25 Jan 2020 01:30PM

Photo Stories