ఐసీఏఆర్ ఎంట్రన్స్ లో ఏపీ విద్యార్ధులకు ర్యాంకుల పంట
అనిమల్ సెన్సైస్‌లో పీజీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో తిరుపతి వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ పూర్తి చేసిన కె.యశ్వంత్ శ్రీనివాస్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. 480 మార్కులకు గాను 346 మార్కులు పొంది మొదటి ర్యాంకు పొందాడు. అనిమల్ సైన్స్ విభాగంలో పృథ్వీరాజ్ 293 మార్కులతో 10వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. వెటర్నరీ సైన్స్ కేటగిరీలో పి.వైదేహి 366 మార్కులు సాధించి నాల్గవ ర్యాంకు సాధించింది. ఎం.ఆమని 23, సాయిసింహారెడ్డి 32వ ర్యాంకు సాధించారు. డెయిరీ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన రాత పరీక్షలో ఆదిత్య సుకుమార్ 2వ ర్యాంకు, జీఎస్ స్ఫూర్తి 6వ ర్యాంకు, జె.శాలిని 11వ ర్యాంకు సాధించారు. డెయిరీ సైన్స్ లో పీజీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఎన్.వందన 79వ ర్యాంకు, డెయిరీ టెక్నాలజీలో పీజీ ప్రవేశ పరీక్షలో పవన్‌కుమార్‌రెడ్డి 65వ ర్యాంకు పొందారు. డెయిరీ మైక్రోబయాలజీ (పీహెచ్‌డీ)లో ఇ.శ్రీనిహారిక 6వ ర్యాంకు, డెయిరీ టెక్నాలజీ (పీహెచ్‌డీ)లో కె.సాయిప్రియ 10వ ర్యాంకు పొందారు. వీరందరినీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి అభినందించారు.
వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ర్యాంకులు..
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏఐఈఈఏ ప్రవేశ పరీక్షలో ఎస్వీ వ్యవసాయ కళాశాలకు చెందిన పలువురు ర్యాంకులు సాధించారు. పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్లాంట్ సైన్స్ లో దినేష్ 11వ ర్యాంకు, నిషిత్‌రెడ్డి 13వ ర్యాంకు, హమీద 20వ ర్యాంకు పొందారు. ఆగ్రానమీలో కృష్ణబాబు 3వ ర్యాంకు పొందాడు. ఫిజికల్ సైన్స్ లో జయకిషోర్ 21వ ర్యాంకు సాధించాడు.
ప్రకాశం విద్యార్థికి 27వ ర్యాంకు
ఫుడ్ టెక్నాలజీ విభాగంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలెం గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు జాతీయ స్థాయిలో 27వ ర్యాంక్, ఎస్సీ కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించాడు.