ఐఎన్‌ఐ సెట్– 2021 వాయిదా వేయండి
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్, జిప్‌మర్ సహా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసిద్ధ విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఐ సెట్)– 2021 వాయిదా వేయాలంటూ పలువురు వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జూన్ 16న నిర్వహించనున్న ఈ పరీక్షలు వాయిదా వేయాలని 26 మంది వైద్యుల తరఫున న్యాయవాది పల్లవి ప్రతాప్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు, ఇతరత్రా ప్రొఫెషనల్ పరీక్షలు రద్దు చేయడం లేదా వాయిదా వేయడం చేశారని, ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పనిచేస్తున్న వైద్యులకు ఈ సమయంలో పరీక్షలు ఒత్తిడి పెంచుతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వైద్యులు కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోలేదని, ఈ పరీక్షలు వాయిదా వేయకుంటే వేలాది మంది వైద్యుల ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Published date : 08 Jun 2021 01:51PM