Skip to main content

ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ట్యూషన్ ఫీజుల పెంపు ఉండబోదు: రమేశ్ పోఖ్రియాల్ నిశాంఖ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీజుల పెంపు ఉండబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంఖ్ ఏప్రిల్ 26న వెల్లడించారు.
ఐఐటీ కౌన్సిల్ స్థాయీసంఘం చైర్మన్, ఐఐటీల డెరైక్టర్లతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే ట్రిపుల్ ఐటీల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీజులు పెంచరాదని కోరామన్నారు.
Published date : 27 Apr 2020 04:34PM

Photo Stories