ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్ ఎడ్సెట్– 2021 పరీక్ష
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఆగస్టు 24, 25 తేదీల్లో జరిగే టీఎస్ఎడ్సెట్–2021కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొ.రామకృష్ణ బుధవారం తెలిపారు.
తెలంగాణలో 45, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హాల్ టికెట్లను edcet.trhe.ac.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 90 నిమిషాల ముందు అంటే ఉదయం 8.30, మధ్యాహ్నం 1.30 గంటలకు రావాలని కన్వీనర్ చెప్పారు. కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కు ధరించాలని, తాగు నీరు, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 42,399 మంది అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాలు విడుదల: ఇక విద్యార్థుల లెక్కను బట్టే టీచర్లు, హెచ్‌ఎంలు..
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పాఠశాలలు ప్రారంభం..!
చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాలు విడుదల: ఇక విద్యార్థుల లెక్కను బట్టే టీచర్లు, హెచ్‌ఎంలు..
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పాఠశాలలు ప్రారంభం..!
Published date : 19 Aug 2021 04:19PM