ఆగస్టు 21, 22 తేదీల్లో సీపీజీఈటీ–2021 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రద్దు..
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: టీసీఎస్ సైట్ అంతరాయం వలన ఆగస్టు 21, 22 తేదీల్లో సీపీజీఈటీ–2021 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను రద్దు చేసినట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి గురువారం తెలిపారు.
దరఖాస్తులను తిరిగి ఆగస్టు 23 నుంచి యథావిధిగా స్వీకరిస్తామన్నారు. ఇంతవరకు 30 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
Published date : 20 Aug 2021 07:19PM