Skip to main content

అధ్యాపకులు బోధన విధానం మార్చుకోవాలి: ఉన్నత విద్యాశాఖ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థుల కోసం పారిశ్రా మికవేత్తలు ఎదురుచూసేలా వారిని తీర్చిదిద్దాలని.. అధ్యాపకులు తమ బోధనా విధానాన్ని మార్చుకో వాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల అధ్యా పకులకు సూచించారు.
ప్రైవేట్‌ కాలేజీలతో పోల్చుకుంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నారని ఆయనన్నారు. అయినా, ప్రైవేట్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను ప్రభుత్వ అధ్యాపకులే ఆలోచించాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయం నుంచి మంగళవారం సతీష్‌చంద్ర వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాల పనితీరును సమీక్షించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పానికి అనుగుణంగా అధ్యాపకు లు తమ పనితీరును మార్చుకోవాలని సూచించా రు. ప్రతి ప్రొఫెసరు వారానికి 8 గంటల థియరీ, 6 గంటలు ప్రాక్టికల్‌ క్లాస్‌లను ఆన్‌లైన్‌ ద్వారా బోధించాలని స్పష్టంచేశారు. వర్చువల్‌ ల్యాబ్‌ ద్వారా ప్రాక్టికల్‌ క్లాస్‌లు నిర్వహించాలని.. ఇవి లేనిచోట వీడియో ద్వారా ప్రాక్టికల్‌ క్లాసులను ఆన్‌లైన్‌ ద్వారా వివరించాలని సూచించారు. యోగి వేమన వర్సిటీలో ఆన్‌లైన్‌ క్లాస్‌ల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికిపైగా ఉండటంపై వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్, రెక్టార్, అధ్యాపకులను అభినందించారు. అధ్యాపకులు వారానికి 14 గంటలు తగ్గకుండా బోధించడాన్ని ఆయన ప్రశంసించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రేమచంద్రారెడ్డి కూడా పలు సూచనలిచ్చారు.
Published date : 16 Jun 2021 05:34PM

Photo Stories