అధిక ఫీజుల స్కూళ్లపై ఏం చర్యలు తీసుకున్నారు: హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయా లంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46కు విరుద్ధంగా వ్యవహరించిన పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ జీవోను అమలు చేయని ఎన్ని పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు? ఎన్ని పాఠశాలల గుర్తింపు రద్దు చేశారు? తదితర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. జీవో 46కు విరుద్ధం గా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన మూడు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. జీవో 46కు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ స్కూళ్ల పై చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. ఈ మేరకు తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. అధిక ఫీజుల వసూలుకు సంబంధించి సెయింట్ ఆండ్రూస్ పాఠశాలపై ఎక్కువ ఫిర్యాదు లు వచ్చినట్లు తెలిపారు. జీవో 46 అమలుకు సంబంధించి రాష్ట్ర జిల్లా స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఫీజులు చెల్లించలేదని విద్యార్థుల పరీక్ష ఫలితాలు వెల్లడించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం పేర్కొన్న ఫీజులు తీసుకుని విద్యార్థుల ను నిబంధనల మేరకు ప్రమోట్ చేసేలా ఆదేశిం చాలని కోరారు. వాదనల అనంతరం ఎన్ని స్కూళ్ల కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు తదితర వివరాలను సమరి్పంచాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
Published date : 01 Apr 2021 06:06PM