Skip to main content

ఆదివాసీ బిడ్డకు అరుదైన గౌరవం

కెరమెరి (ఆసిఫాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ కన్నీబాయిని అడ్వెంచర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.
ఈ మేరకుఫిబ్రవరి 3నఉత్తర్వులు అందాయి. ఫిబ్రవరి 6వ తేదీన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్లో జరిగే సాహస క్రీడలు, పలు రాష్ట్రాల్లోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. కన్నీబాయి మౌంటేనీర్, రెండవ ప్రపంచ కప్ వాటర్ రాఫిల్లింగ్ గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు ఆదిమ గిరిజన సలహా సంఘంలో సూపర్ వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెకు రాష్ట్రం నుంచి 95వ ఫౌండేషన్ కోర్స్ ఏఐఎస్, సీసీఎస్ (ఐఏఎస్, ఐపీఎస్, ఐఐఏఎస్) ఐస్ బ్రేకింగ్ సెషన్‌లో పరిశీలకురాలిగా ప్రత్యేక ఆహ్వానం అందింది.
Published date : 04 Feb 2020 04:35PM

Photo Stories