76 గురుకులాల నిర్మాణానికి రూ. 4,560 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం!
Sakshi Education
సాక్షి, అమరావతి: వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4,560 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం 26 గురుకులాలకు ప్రభుత్వ భవనాలు ఉండగా 76 గురుకులాలకు భవనాలు నిర్మించాల్సి ఉంది. ఇందులో 24 గురుకుల పాఠశాలలకు స్థలాలు సిద్ధంగా ఉన్నాయి. 52 పాఠశాలలకు స్థల సేకరణ జరగాల్సి ఉంది. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ. 60 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. 1,120 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా భవనాలు నిర్మించాల్సి ఉంది.
- మొత్తం 106 బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా ఇందులో నాలుగు స్కూళ్లకు భవనాల నిర్మాణం జరుగుతోంది.
- గుండుమల, గుడిబండ, గోనబావి, ఉదయమాణిక్యం గ్రామాల్లో ఈ స్కూళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
- ఈ భవనాలు పూర్తి కావాలంటే రూ. 89.70 కోట్లు కావాల్సి ఉందని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రభుత్వానికి తెలిపింది.
- ప్రస్తుతం 106 గురుకులాల్లో 55 బాలురవి కాగా, 51 బాలికల గురుకులాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 43 బాలుర, 43 బాలికల గురుకులాలు ప్రారంభమై నడుస్తున్నాయి.
- ఈ గురుకులాల్లో 27,212 మంది విద్యార్థులు చదువుతున్నారు.
- తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సొంత భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అప్పట్లో పట్టించుకోకపోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
Published date : 08 Aug 2020 02:00PM