68 జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
Sakshi Education
తిరుపతి లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 68 జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వీటిలో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 55 పోస్టులు, రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా 13 పోస్టులను విడుదల చేసింది. గురువారం నుంచి రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను అభ్యర్థులు పొందవచ్చు. 55 డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులలో ఓసీలకు 30 పోస్టులు కేటాయించగా, వాటిలో మహిళలకు 10, అలాగే వికలాంగులకు ఒకటి, బీసీ-ఏ 5, బీసీ-బీ 5 , బీసీ-సీ ఒకటి, బీసీ-డీ 3, బీసీ-ఈ ఒకటి, ఎస్సీ ఐదు, ఎస్టీ నాలుగు ఉన్నాయి. ఈ కేటగిరీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మూడు సంవత్సరాలు తక్కువ కాకుండా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన వారే జేసీజే పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400లు ఆన్‌లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్‌ను పరిశీలించగలరు.
Published date : 04 Dec 2020 04:24PM