‘6, 7, 8తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించండి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ తరగతులను కొనసాగిస్తూనే 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ట్రస్మా కోరింది.
ఈ మేరకు గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్ వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అవసరమైన తరగతి గదులు సిద్ధంగా ఉన్నాయని, కరోనా నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. షిఫ్టుల పద్ధతిలో పనిచేయటానికి కూడా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మద్దతు తెలియజేశాయని వారు మంత్రికి వివరించారు.
బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి
రాష్ట్రంలో ఇప్పటికే 9, 10 తరగతుల విద్యార్థు లకు ప్రత్యక్ష బోధన ప్రారంభించినందున, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కూడా ఆన్ లైన్ బోధన కొనసాగిస్తూనే ప్రత్యక్ష బోధన ప్రారం భించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డిలకు సంఘం కన్వీనర్ డా. గుండు కిష్టయ్య, కో-కన్వీనర్ ఇంజమూరి రఘునందన్ లు ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు.

Published date : 12 Feb 2021 04:03PM