5 వర్సిటీలకు వీసీల నియామకం: ఉన్నత విద్యా మండలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు ఉపకులపతుల (వైస్ చాన్సలర్)ను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర (ఎస్వీ), శ్రీకృష్ణ దేవరాయ, ద్రవిడ, రాయలసీమ వర్సిటీలకు ఉప కులపతులను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా ఉన్న ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిని అదే వర్సిటీ వీసీగా నియమించారు. ఎస్వీ యూనివర్సిటీ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రాజారెడ్డిని అదే యూనివర్సిటీ ఉప కులపతిగా, అనంతపురం జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎ.ఆనందరావును రాయలసీమ వైస్ చాన్సలర్‌గా, యోగి వేమన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.రామకృష్ణారెడ్డిని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి, హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ తుమ్మల రామకృష్ణను ద్రవిడ యూనివర్సిటీ ఉపకులపతిగా నియమించారు.
Published date : 26 Nov 2020 01:30PM