22 నుంచి వైవీయూ డిగ్రీ పరీక్షలు.. 62 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు..
Sakshi Education
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 3, 5 సెమిష్టర్‌ల విద్యార్థులకు ఈనెల 22వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైవీయూ పరీక్షల నిర్వహణాధికారి ఆచార్య పుత్త పద్మ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల నుంచి 32,233 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో 3వ సెమిష్టర్‌లో రెగ్యులర్ విద్యార్థులు 12,122 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 3,222 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల హాల్‌టికెట్లు, పరీక్షల టైంటేబుల్‌ను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.
Published date : 18 Mar 2021 05:45PM