Skip to main content

2021 సంవత్సరానికి పబ్లిక్ హాలిడేస్ క్యాలెండర్ ఇదే: తెలంగాణ

సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరం (2021)లో 28 సాధారణ సెలవు దినాలు, 25 ఐచ్ఛిక సెలవు దినాలు ఉండనున్నాయి.

ఈ మేరకు సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఆదివారాలతో పాటు అన్ని రెండో శనివారాలు (ఫిబ్రవరి 13 మినహా) మూసి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా 25 ఐచ్ఛిక సెలవుల్లో ఐదుకు మించకుండా వాడుకోవచ్చు. రాష్ట్రంలోని పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు, విద్యా సంస్థలు, పబ్లిక్ వర్క్స్ శాఖల ఉద్యోగులకు ఈ సాధారణ సెలవులు వర్తించవు. ఆయా పండుగలు/సందర్భాల్లో ఈ సంస్థలకు వర్తించనున్న సెలవులను ప్రకటిస్తూ సంబంధిత శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ఇక నెల వంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పర్వదినాల్లో ఏవైనా మార్పులు చేసుకుంటే ప్రభుత్వం ఆ మేరకు సెలవు దినాలను సైతం మార్చనుంది.

సాధారణ సెలవులివే..

క్ర.సం.

పండుగ/సందర్భం

తేదీ

వారం

1.

కొత్త సంవత్సరం

01-01-2021

శుక్ర

2.

భోగి

13-01-2011

బుధ

3.

సంక్రాంతి/పొంగల్

14-01-2021

గురు

4.

గణతంత్ర దినోత్సవం

26-01-2021

మంగళ

5.

మహాశివరాత్రి

11-03-2021

గురు

6.

హోళీ

29-03-2021

సోమ

7.

గుడ్ ఫ్రైడే

02-04-2021

శుక్ర

8.

బాబూ జగ్జీవన్‌రాం జయంతి

05-04-2021

సోమ

9.

ఉగాది

13-04-2021

మంగళ

10.

బీఆర్ అంబేడ్కర్ జయంతి

14-04-2021

బుధ

11.

శ్రీ‌రామనవమి

21-04-2021

బుధ

12.

ఈద్-ఉల్-ఫితర్/రంజాన్

14-05-2021

శుక్ర

13.

రంజాన్ మరుసటి రోజు

15-05-2021

శని

14.

ఈద్ ఉల్ అజా(బక్రీద్)

21-07-2021

బుధ

15.

బోనాలు

02-08-2021

సోమ

16.

స్వాతంత్య్ర దినోత్సవం

15-08-2021

ఆది

17.

షహదత్-ఏ-ఇమామే హుస్సేన్/10వ మొహర్రం

19-08-2021

గురు

18.

కృష్ణాష్టమి

31-08-2021

మంగళ

19.

వినాయక చవితి

10-09-2021

శుక్ర

20.

మహాత్మా గాంధీ జయంతి

02-10-2021

శని

21.

బతుకమ్మ ప్రారంభపు రోజు

06-10-2021

బుధ

22.

విజయదశమి

15-10-2021

శుక్ర

23.

విజయదశమికి మరుసటి రోజు

16-10-2021

శని

24.

ఈద్ మిలాద్ ఉన్ నబీ

19-10-2021

మంగళ

25.

దీపావళి

04-11-2021

గురు

26.

కార్తీకపూర్ణిమ/ గురునానక్ జయంతి

19-11-2021

శుక్ర

27.

క్రిస్మస్

25-12-2021

శని

28.

బాక్సింగ్ డే

26-12-2021

ఆది

Published date : 11 Nov 2020 02:36PM

Photo Stories