2020 విద్యా సంవత్సరానికి హెల్త్‌కేర్ కోర్సులు రద్దు!
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): జంటనగరాల్లోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ కోర్సులను 2020 విద్యా సంవత్సరానికి రద్దు చేశారు.
ఓయూకు అనుబంధంగా ఆయా ఆస్పత్రుల్లో ఏడాది కాలవ్యవధితో 14 డిప్లొమా కోర్సులను నిర్వహించేవారు. కరోనా కారణంగా ఆస్పత్రి వర్గాలు, ఓయూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కోర్సులు నిర్వహించలేదు. డిమాండ్ ఉన్నా ప్రవేశాలు చేపట్టకపోవడంపై విద్యార్ధులు నిరుత్సాహపడుతున్నారు.
Published date : 10 Apr 2021 05:23PM