2014-19 వరకు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలి: టీఎస్ ప్రభుత్వం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద బకాయిలుండొద్దని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏటా చాలినన్ని నిధులు కేటాయిస్తున్నప్పటికీ.. సాంకేతిక కారణాలతో వంద శాతం చెల్లింపులు జరగడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం కొంత మేర నిధులు విడుదల చేయకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఇలా 2014-15 వార్షిక సంవత్సరం నుంచి 2018-19 వార్షిక సంవత్సరం మధ్య కాలంలో సుమారు రూ.613 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరంలో కేటాయించిన నిధులకు అదనంగా రూ.200 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండ్రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై లోతైన చర్చ జరిగింది. దీంతో ఏటా పెండింగ్‌లో పడుతున్న బకాయిలను పరిశీలించిన మంత్రి.. వీటిని యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని ఆదేశించారు.
బకాయిలు చెల్లించిన తర్వాతే...
ప్రస్తుతం 2019-20 వార్షిక సంవత్సరం మరో నెల రోజుల్లో ముగుస్తుంది. దీంతో ఈ వార్షిక సంవత్సరం డిమాండ్ ఎంతుందనే అంశంపై సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. వీటిని పరిశీలించే పనిలో పడ్డారు. 2019-20 వార్షిక సంవత్సరంలో 12.85 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రాథమికంగా అంచనావేయగా.. రూ.2,250 కోట్లు అవసరమని గుర్తించారు. దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు మరో రెండు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గత బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పాత బకాయిలకు సంబంధించి జనవరి నెలాఖరు వరకు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు చేసి సంబంధిత కాలేజీ యాజమాన్యాల నుంచి ఆధారాలను సేకరించారు. తాజాగా ఆయా నిధుల విడుదలకు ప్రభుత్వం బీఆర్వో (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లు)లను సిద్ధం చేస్తోంది. అవి వెలువడిన వెంటనే బకాయిలన్నీ చెల్లించాలని సూచించింది. వాటి చెల్లింపులు పూర్తయిన తర్వాత మిగులు నిధులతో 2019-20 వార్షిక సంవత్సరం బిల్లులు క్లియర్ చేయాలని స్పష్టంచేసింది.

Published date : 25 Feb 2020 01:51PM