20 ఏళ్ల సర్వీసుంటే... పూర్తి పెన్షన్: టీఎస్ పీఆర్సీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని పదవీ విరమణ చేస్తే వారికి పూర్తిస్థాయి లో పెన్షన్ సదుపాయం కల్పించాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్ర మూ అనుసరించాలని సూచించింది. ప్రస్తు తం 33 ఏళ్ల సర్వీసు ఉంటేనే పూర్తి పరిమాణంలో పెన్షన్‌ను చెల్లిస్తున్నారు. 20 ఏళ్లలోపు సర్వీసుతో పదవీవిరమణ చేసే ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదేళ్ల సర్వీసు వెయి టేజీ విధానాన్ని కొనసాగించాలని సూచించింది.
పెన్షనర్ల విషయంలో పీఆర్‌సీ కమిటీ సిఫార్సులివీ..
- 75 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు రిలీఫ్‌గా మూల పెన్షన్‌పై 15 శాతాన్ని అదనంగా చెల్లించాలి. 100 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు 100 శాతం వరకు మూల పెన్షన్‌ను అదనంగా చెల్లించాలి.
- కనీస పెన్షన్/ ఫ్యామిలీ పెన్షన్‌ను నెలకు రూ.9,700కు పెంచాలి.
- సవరించిన కనీస వేతనం (రూ.19 వేలు)లో 50% కనీస పెన్షన్‌గా ఉండాలి. కరువు భత్యం లేకుండా 2018 జూలై 1 నుంచి ఈ పెంపును వర్తింపజేయాలి.
- సర్వీసులో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, మరణించిన మరుసటి రోజు నుంచి గరిష్టంగా 10 ఏళ్ల పాటు లేదా మరణించిన ఉద్యోగి/ పెన్షనర్ 65 ఏళ్ల వయస్సుకు చేరే వరకు.. ఈ రెండింటిలో ఏది ముం దు సంభవిస్తే అప్పటి వరకు కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్‌ను చెల్లించాలి.
- మానసికంగా/ శారీరకంగా వికలాంగులైన కుమారుడు/కుమార్తె వివాహమైనప్పటికీ జీవితకాలం పాటు ఫ్యామిలీ పెన్షన్ చెల్లించాలి.
- పదవీ విరమణ సమయంలో చెల్లించే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలి.
- సర్వీసు పెన్షనర్/ ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు చెల్లించాల్సిన రిలీఫ్ అమౌంట్‌ను రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలి.
- కేంద్ర ప్రభుత్వం కమ్యుటేషన్ టేబుల్‌ను సవరించే వరకు పెన్షన్‌లో కమ్యుటెడ్ పోర్షన్‌ను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించే విధానాన్ని కొనసాగించాలి.
Published date : 28 Jan 2021 03:03PM