Skip to main content

170 ఇంజనీరింగ్ కాలేజీల్లో లక్షకు పైగా సీట్లు..

సాక్షి, హైదరాబాద్:పస్తుతం జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 170 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో లక్షకు పైగా సీట్లు ఉన్నాయి.
అయితే ఏటా జేఎన్టీయూ 85 వేల వరకు సీట్లను భర్తీ చేసేందుకు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తోంది. ప్రస్తుతం కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈసారి అదనంగా మరో 10 వేల సీట్లలో ప్రవేశాలకు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు 100 ఫార్మసీ కాలేజీలు, 10 పీజీ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 50 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోనూ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండి, ఆయా కోర్సులను ప్రారంభించాలనుకునే యాజమాన్యాల నుంచి జేఎన్టీయూ దరఖాస్తులు స్వీకరించి అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని డ్రాఫ్ట్ అఫీలియేషన్ రెగ్యులేషన్స్ లో పొందుపరిచింది.

కొత్త కోర్సులతోపాటు కొత్త కాలేజీలకు అనుమతి :
రానున్న విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులతో పాటు అదనపు సీట్లకు ఓకే చెప్పనుంది. మరోవైపు కొత్త కాలేజీల ఏర్పాటును కూడా అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆయా కాలేజీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటేనే వాటికి ఓకే చెప్పాలని, నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్లను (ఎన్‌వోసీ) అందజేయాలని నిర్ణయించింది. కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాలన్నా, అనుమతి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత యూనివర్సిటీ ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉంటేనే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కాలేజీల ఏర్పాటుకు, ఇంటేక్ పెంపునకు అనుమతి ఇవ్వనుంది. 2020-21 విద్యాసంవత్సరంలో కాలేజీల అనుమతులకు సంబంధించిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌ను ఇంకా విడుదల కాలేదు. అది విడుదల అయ్యాక ఏఐసీటీఈ అందులో విధాన నిర్ణయానిన్న ప్రకటించనుంది. కొత్త కోర్సులకు అనుమతించాలని కిందటేడాదే ఏఐసీటీఈ విధానపర నిర్ణయం తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డాటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఏఐసీటీఈ వ్యతిరేకించేది ఉండదు కాబట్టి జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది.
Published date : 04 Feb 2020 04:27PM

Photo Stories