1,640 నర్సుల పోస్టుల భర్తీకి అనుమతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1,640 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం అనుమతిచ్చింది.
ఏడాది పాటు లేదంటే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించుకునేంత వరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన తాత్కాలికం గా వీరి నియామకానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సిద్దిపేట మెడికల్ కాలేజీకి 361, ‘నీలోఫర్’కు 278, ఆదిలాబాద్ రిమ్స్‌కు 169, మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి 160, గాంధీకి 137, నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలకు 121, ఉస్మానియాకు 104 పోస్టులతో పాటు వివిధ ఆసుపత్రులకు మిగిలిన వాటిని మంజూరు చేశారు.
Published date : 23 Mar 2020 05:44PM