Skip to main content

16 నెలలుగా జీతాలివ్వడం లేదు: హైకోర్టులో పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న తమకు గత 16 నెలలుగా వేతనాలివ్వడం లేదంటూ దినేష్‌చంద్రతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.
ఈ పిటిషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 5కు వాయిదా వేశారు. ఈఎస్‌ఐలో మందుల కుంభకోణం జరిగిందని, ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోందని పిటిషనర్ల తరఫున న్యాయవాది జి.శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఈ కుంభకోణంతో ఉద్యోగులకు సంబంధం లేకపోయినా గత 16 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా.. రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరే సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. అయితే, వేతనాలకు సంబంధించి ఈ పిటిషన్‌ దాఖలు చేశారని, కుంభకోణం గురించి చెప్పాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి సూచించారు.
Published date : 01 Aug 2020 04:24PM

Photo Stories