Skip to main content

11.87 లక్షల మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన..!

సాక్షి, అమరావతి: నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రంగం సిద్ధం చేశారు.
ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి 20 వేల రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన విజయనగరంలో ప్రారంభించనున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న వారికే వసతి దీవెన ఇస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింప చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం వర్తించే విద్యార్థుల సంఖ్య పెరిగింది. జగనన్న వసతి దీవెనను 11,87,904 మంది విద్యార్థులకు వర్తింప చేయనున్నారు. తొలి విడత విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.1,139.16 కోట్లను జమ చేయనున్నారు. ఏడాదికి రెండు సార్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇప్పుడు 24వ తేదీన తొలి విడతలో 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, 86,896 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500 చొప్పున, డిగ్రీ ఆ పై చదువుతున్న 10,47,288 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నారు. 25వ తేదీ నుంచి జగనన్న విద్యా, వసతి దీవెన కార్డులను గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి అందజేయనున్నారు. వసతి దీవెన నగదు అందినట్లు విద్యార్థుల తల్లుల నుంచి రశీదులు స్వీకరించనున్నారు. 24వ తేదీన రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.

జిల్లా పేరు

ఐటీఐ విద్యార్థులు

నగదు

పాలిటెక్నిక్ విద్యార్థులు

నగదు

డిగ్రీ, ఆపై విద్యార్థులు

నగదు విద్యార్థులు

మొత్తం

మొత్తం (రూ.కోట్లలో)

 

 

 

 

 

 

 

 

 

అనంతపురం

3,638

1.82

4,290

3.22

77,113

77.11

85,041

82.15

చిత్తూరు

3,069

1.53

6,611

4.96

1,22,219

122.22

1,31,899

128.71

తూర్పుగోదావరి

6,828

3.41

11,126

8.34

1,05,984

105.98

1,23,938

117.73

గుంటూరు

3,804

1.90

7,675

5.76

1,08,139

108.14

1,19,618

115.80

వైఎస్సార్

2,806

1.40

5,184

3.89

70,605

70.61

78,595

75.90

కృష్ణా

3,974

1.99

14,903

11.18

1,00,320

100.32

1,19,197

113.49

కర్నూలు

3,171

1.59

3,716

2.79

75,577

75.58

82,464

79.96

నెల్లూరు

2,057

1.03

3,334

2.50

62,150

62.15

67,541

65.68

ప్రకాశం

5,375

2.69

3,910

2.93

60,843

60.84

70,128

66.46

శ్రీకాకుళం

3,071

1.54

2,826

2.12

51,373

51.37

57,270

55.03

విశాఖపట్నం

6,802

3.40

12,179

9.13

86,728

86.73

1,05,709

99.26

విజయనగరం

2,627

1.31

4,117

3.09

52,944

52.94

59,688

57.34

పశ్చిమగోదావరి

6,498

3.25

7,025

5.27

73,293

73.13

86,816

81.65

మొత్తం

53720

26.86

86896

65.18

1047288

1047.12

1187904

1139.16

Published date : 22 Feb 2020 12:56PM

Photo Stories