1,110 మంది ఎస్సైలు.. రూ. 27 లక్షలతో..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తమ బ్యాచ్‌మేట్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి అండగా నిలిచారు 2009 బ్యాచ్ ఎస్సైలు.
2009 బ్యాచ్‌కి చెందిన డేగల భగవాన్ ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. మార్చి 23వ తేదీన బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని భావించిన 2009 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన 1,110 మంది ఎస్సైలు రూ.27 లక్షలు జమ చేసి ఏఫ్రిల్ 3వ తేదీన భగవాన్ ప్రసాద్ కుటుంబానికి అందజేశారు. 2009 బ్యాచ్ సొసైటీ అధ్యక్షుడు జి.శ్రీనివాస్ బ్యాచ్ తరపున చెక్ అందజేశారు.
Published date : 05 Apr 2021 05:44PM