Skip to main content

సివిల్స్ సాధిస్తాను: తెలంగాణ ఎంసెట్ 8వ ర్యాంకర్ అన్నం సాయివర్ధన్

తెలంగాణ ఇంజీనీరింగ్ ఎంసెట్ ఫ‌లితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అక్టోబ‌ర్ 6న‌ విడుద‌ల చేశారు.
ఈ ఫ‌లితాల్లో టాప్‌-10 ర్యాంకుల‌ను బాలురే కైవ‌సం చేసుకున్నారు. అందులో 5 ర్యాంకులు తెలంగాణకు చెందిన విద్యార్థులు, మ‌రో 5 ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులు సాధించారు. ఈ త‌రుణంలో తెలంగాణ ఎంసెట్ 8వ ర్యాంకర్ అన్నం సాయివర్ధన్ త‌న‌ సంతోషాన్ని పంచుకున్నారిలా..
మాది మంచిర్యాల. ఎంసెట్‌లో 8వ ర్యాంక్, జేఈఈ అడ్వాన్స్‌లో 93వ ర్యాంక్ సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌ చేసిన తర్వాత సివిల్స్ సాధించాలని ఉంది. పేదల‌కు స‌హాయం చేయ‌డంతో పాటు దేశ సేవ చేయాలనేది నా ల‌క్ష్యం. అంతేకాకుండా ఎంతో మంది అనేక ర‌కాల ఇబ్బందులు ప‌డుతున్నారు. వారికి నాకు చేత‌నైనా స‌హాయం చేస్తాను.
Published date : 19 Aug 2021 12:53PM

Photo Stories