ఈ మూడు స్కిల్స్ ఉండే కార్పొరేట్ కొలువు ఖాయం
Sakshi Education
కార్పొరేట్ కంపెనీలు కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి.అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ మూడు స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలిచి కార్పొరేట్ కొలువు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ కార్పొరేట్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నెలకొల్పిన శివనాడార్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిఖిల్ సిన్హా. ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్‌లో ఇంగ్లిష్‌లో బీఏ ఆనర్స్.. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో కమ్యూనికేషన్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు అకడమిక్, కార్పొరేట్ రంగంలో విశేష అనుభవం గడించిన ప్రొఫెసర్ నిఖిల్ సిన్హాతో ఇంటర్వ్యూ...
ఆధునిక విధానాలు.. సరళమైన కరిక్యులం
విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా దీటుగా రాణించాలంటే ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయి నుంచే మార్పులు మొదలవ్వాలి. బోధన పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేయాలి. అదేవిధంగా కరిక్యులంలోనూ మార్పులు తేవాలి. కరిక్యులం సరళంగా, సృజనాత్మక నైపుణ్యాలను వెలికితేసేలా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను అందించే విధంగా ఆధునిక కరిక్యులంను రూపొందించాలి. ముఖ్యంగా వృత్తివిద్యా కోర్సుల్లో నేటి పరిస్థితుల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ సిస్టమ్ ఎంతో అవసరం. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత దిశగా విస్తృత దృక్పథంతో ఆలోచించి, అంతర్జాతీయ అవసరాలకు సరితూగేలా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి.
యూనివర్సిటీల స్థాయిలోనూ మార్పులు అవసరం
యూనివర్సిటీల స్థాయిలో అందించే సంప్రదాయ బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ మార్పులు రావాలి. ఒక డిగ్రీ కోర్సులో ఒకే సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకునే విధానం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదు. మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ దృక్పథంతో కోర్సులను రూపొందించాలి. ప్రతి కోర్సులోనూ ‘గ్రూప్ సబ్జెక్ట్స్’ అనే విధానాన్ని అనుసరిస్తూనే ఇతర సబ్జెక్ట్‌లతో ఇంటిగ్రేట్ చేయడం ఎంతో అవసరం. నేటి విద్యా వ్యవస్థలో ప్రధాన లోపం.. ప్రస్తుతం అమలవుతున్న బోధన పద్ధతులు. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినప్పటికీ ఇంకా 20వ శతాబ్దపు బోధన విధానాలే అమలవుతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు లభించట్లేదు. కొత్త సవాళ్లను స్వీకరించేలా విద్యార్థులు రూపొందలేకపోతున్నారు.
ప్రయోగాత్మక అభ్యసనానికి పెద్దపీట
విద్యార్థులు ప్రయోగాత్మక అభ్యసనానికి (ఎక్స్‌పరిమెంటల్ లెర్నింగ్)కు పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్స్, సర్వీస్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ వంటి క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే వాటిలో పాల్పంచుకోవడం ద్వారా అకడమిక్ స్థాయిలోనే ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు కూడా ఈ విషయంలో తమ వంతు కృషి చేయాలి. చొరవ తీసుకోవాలి. క్లాస్ రూం, లేబొరేటరీల్లో శిక్షణతోపాటు పరిశోధన కార్యకలాపాల్లో పాల్పంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.
మౌలిక సదుపాయాలే.. మొదటి సాధనాలు
విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలంటే అకడమిక్ స్థాయిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మెరుగ్గా ఉంటే విద్యార్థులకు మరిన్ని అభ్యసన సాధనాలు అందుబాటులోకి వస్తాయి. వీటివల్ల చక్కటి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. తద్వారా సదరు యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌కు కూడా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా ఒక విద్యా సంస్థ లక్ష్యాలు నెరవేరడానికి భౌతిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు ఎంతో దోహదం చేస్తాయి. అందుకే వీటి మెరుగుకు కృషి చేయాలి. నిపుణులైన ఫ్యాకల్టీ, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం మౌలిక సదుపాయాల లేమి కారణంగా గుర్తింపునకు నోచుకోని యూనివర్సిటీలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి.
‘గ్యాప్’ తగ్గించాలనే
ఇటీవల దేశంలో పలు కార్పొరేట్ సంస్థలు విద్యా రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న గ్యాప్‌ను తగ్గించడం కోసమే సొంతంగా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో నెలకొన్న అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ.. టీచింగ్, లెర్నింగ్ విధానంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నాయి. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి వాస్తవ అవసరాలకు సరితూగేలా, జాబ్ రెడీ స్కిల్స్‌తో బయటికి వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి.
అకడమిక్స్ నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఎంతో అవసరం. ఇటీవల కాలంలో మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో మరెందరో ఔత్సాహికులు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదా స్టార్టప్ నెలకొల్పాలంటే వారసత్వం ముఖ్యమనే అభిప్రాయంలో ఉన్నారు. దీన్ని విడనాడాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేవలం ఫ్యామిలీ బిజినెస్ సంస్థలకే పరిమితం కాదు. ఔత్సాహికులకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అటు అకడమిక్‌గానూ తరగతి గది నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు, అర్హతలపై అవగాహన పెంపొందించాలి.
ఆ మూడు ముఖ్యం
ప్రస్తుతం సంస్థలు.. ఉద్యోగార్థుల విషయంలో.. కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇప్పుడు ఆయా కోర్సుల్లో ఉన్న విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే.. జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలుస్తారు. అదే విధంగా రెగ్యులర్ లెర్నింగ్ దృక్పథాన్ని అనుసరిస్తే కెరీర్ కూడా నిత్య నూతనంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇదే నా సలహా.

Published date : 03 Nov 2014 03:35PM