అరుదైన కోర్సు.. అద్భుత అవకాశాలు!!
Sakshi Education
స్టాటిస్టిక్స్ (సాంఖ్యక శాస్త్రం).. సర్వేలు, డేటాలు, పైచార్ట్‌లు, ఫ్లోచార్ట్‌లతో ఆయా అంశాలను సమగ్రంగా విశ్లేషించే సబ్జెక్ట్! సెన్సస్ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకూ.. నేడు స్టాటిస్టిక్స్ అవసరం లేని రంగం లేదంటే అతిశయోక్తికాదు!! స్టాటిస్టీషియన్‌లు టన్నులకొద్దీ డేటాను సునిశితంగా పరిశీలించి.. విశ్లేషించి.. సమస్యకు సచిత్రంగా పరిష్కారం చూపెడతారు. ఆర్థిక గణాంకాల విశ్లేషణ, జనాభా, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగం మొదలు అంతరిక్ష పరిశోధన వరకూ.. ఆయా రంగాల్లో డేటాను విశ్లేషించేందుకు స్టాటిస్టిక్స్ స్కిల్స్ ఉన్నవారి అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు స్టాటిస్టిక్స్ కోర్సును పూర్తిచేయడం ద్వారా అద్భుత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (ఏఐఎంఎస్‌సీఎస్) డైరెక్టర్ డాక్టర్ అల్లం అప్పారావు. ఆయనతో గెస్ట్‌కాలమ్..
దశాబ్దాల క్రితమే
స్టాటిస్టిక్స్ అవసరాన్ని ప్రభుత్వం, ఆర్థికవేత్తలు దశాబ్దాల క్రితమే గుర్తించారు. ఆ క్రమంలోనే ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ పి.సి.మహలనోబిస్ ఆధ్వర్యంలో 1931లో కోల్‌కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) ఏర్పాటైంది. ప్రస్తుతం కోల్‌కతాతోపాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌లలో ఈ సంస్థ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అకడమిక్ కోర్సుల బోధన సాగుతోంది.
అవగాహన పెరగాలి
దశాబ్దాల క్రితమే స్టాటిస్టిక్స్ ఆవశ్యకతను గుర్తించి ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసినా.. నేటికీ ఈ కోర్సుల పట్ల అవగాహన ఆశించిన స్థాయిలో లేదు. దేశంలోని యూనివర్సిటీలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో భాగంగా కొన్ని కాంబినేషన్లలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నాయి. దానివల్ల విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు లభించడంలేదు. కాబట్టి ఈ విషయంపై విద్యావేత్తలు, ఇన్‌స్టిట్యూట్‌లు దృష్టిసారించి పూర్తిస్థాయి కోర్సుల రూపకల్పన దిశగా కృషిచేయాలి. స్టాటిస్టిక్స్ కోర్సులు అభ్యసించినవారికి అందివస్తున్న అవకాశాలపై అవగాహన కల్పించాలి. స్టాటిస్టిక్స్ పట్ల పాఠశాల స్థాయి నుంచే అవగాహన పెంచేందుకు సీఆర్ రావు ఏఐఎంఎస్‌సీఎస్ కృషి చేస్తోంది. ఈ క్రమంలో పదోతరగతి, 10+2 ఉత్తీర్ణులకు ప్రతిఏటా ఏప్రిల్/మే నెలల్లో జాతీయస్థాయిలో స్టాటిస్టిక్స్ ఒలింపియాడ్ నిర్వహిస్తున్నాం. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి అర్హులు.
పీజీ స్థాయిలోనైనా
మన దేశంలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ కోర్సుపై పెద్దగా అవగాహనలేదు. కాబట్టి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌గా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ స్థాయిలో స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు పీజీ స్థాయిలోనైనా స్టాటిస్టిక్స్‌లో చేరి, మంచి అవకాశాలను అందుకోవచ్చు.
ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెంచాలి
బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో పూర్తిస్థాయి స్టాటిస్టిక్స్ కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరగాలి. నేటికీ ఐఎస్‌ఐ- కోల్‌కతా, దాని అనుబంధ నాలుగు క్యాంపస్‌లు, తమిళనాడులో నాలుగైదు ఇన్‌స్టిట్యూట్‌లు, ఇలా పరిమిత సంఖ్యలోనే స్టాటిస్టిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. ఇవి స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిస్థాయి మాస్టర్స్ కోర్సు అందుబాటులో ఉంది. ఈ మొత్తం ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి రెండు వేల మందిలోపు మాత్రమే స్టాటిస్టిక్స్ కోర్సులు పూర్తిచేసుకొని బయటకు వస్తున్నారు. అయితే, మార్కెట్ అవసరాలను పరిశీలిస్తే.. వేల సంఖ్యలో స్టాటిస్టీసియన్ల అవసరముంది. ఒక్క ప్రభుత్వ విభాగంలోనే అనేక అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తకొత్త పథకాలు ప్రవేశపెడుతుండటంతో.. అందుకు సంబంధించిన డేటా సేకరణలో స్టాటిస్టిక్స్ నైపుణ్యాలున్న వారి అవసరం పెరుగుతోంది. అవసరాలకు తగ్గట్లు రాష్ట్ర స్థాయిలోని యూనివర్సిటీలు పూర్తిస్థాయి స్టాటిస్టిక్స్ కోర్సులకు రూపకల్పన చేయాలి.
సీఆర్ రావు ఏఐఎంఎస్‌సీఎస్ ఉద్దేశమిదే
సీఆర్‌రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ప్రధాన ఉద్దేశం.. స్టాటిస్టిక్స్ కోర్సులతో అందుబాటులోకి వస్తున్న అవకాశాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడం.. అందుకు తగిన కోర్సులు రూపొందించడం. ప్రస్తుతం ప్రధానంగా పరిశోధనలపై దృష్టిసారిస్తున్నాం. భవిష్యత్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నాం. అందుకు అవసరమైన మౌలికవసతుల కల్పన విషయంలో ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనందిస్తే మా లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. తద్వారా విద్యార్థులకు చక్కటి కెరీర్ సొంతమవుతుంది. అంతేకాకుండా స్టాటిస్టీషియన్ల నైపుణ్యం సమాజంలోని పలు సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది.
మల్టీడిసిప్లినరీ దృక్పథం
సీఆర్‌రావు ఏఐఎంఎస్‌సీఎస్.. ఈ ఇన్‌స్టిట్యూట్ పేరులోనే మూడు కోర్సులు ప్రతిబింబిస్తాయి. దీని అర్థం.. మల్టీ డిసిప్లినరీ విధానంలో పరిశోధనలు చేపట్టడం. స్టాటిస్టిక్స్‌కు వెన్నెముక మ్యాథమెటిక్స్. కాగా ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ కూడా కీలకంగా మారింది. అందుకే మేం చేపట్టే పరిశోధనల్లో ఈ మూడు అంశాలను సమ్మిళితం చేసేలా ప్రణాళికలు రూపొందించి, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.
పరిశోధనలతో పలు ప్రయోజనాలు
ప్రస్తుతం స్టాటిస్టిక్స్‌తో పీజీ పూర్తికాగానే ఉద్యోగాలు లభిస్తున్న పరిస్థితి ఉంది. అయితే, పీజీ స్థాయిలో స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసిన వారు పీహెచ్‌డీ దిశగా అడుగులు వేస్తే మరిన్ని అవకాశాలు సొంతమవడం ఖాయం. ఈ విభాగంలో మానవ వనరులకు ఉన్న డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాల కారణంగా.. పీజీ కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో చాలా తక్కువమంది మాత్రమే పరిశోధనల వైపు దృష్టిసారిస్తున్నారు. వందకోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశంలో స్టాటిస్టిక్స్ అంశంపై పరిశోధనలు చేస్తున్న వారి సంఖ్య 200 లోపే ఉండటం గమనార్హం. విదేశాల్లో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా అమెరికా, యూకే లాంటి దేశాల్లో లక్షలమంది విద్యార్థులు స్టాటిస్టిక్స్‌లో రీసెర్చ్, అడ్వాన్స్‌డ్ రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రైవేట్.. ప్రభుత్వం రెండు విభాగాల్లోనూ
స్టాటిస్టిక్స్ నిపుణుల అవసరం ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ రంగంలోనూ అధికంగా ఉంది. ప్రైవేట్ రంగంలో యువత ఎంతో క్రేజీగా భావిస్తున్న ఐటీ,సాఫ్ట్‌వేర్ మొదలుకొని.. మెడికల్ సైన్స్, టెలికాం, మొబైల్ కమ్యూనికేషన్, ఫార్మా.. ఇలా ప్రతి పరిశ్రమలోనూ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో అవకాశాల విషయానికి వస్తే.. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర గణాంక శాఖ, సంబంధిత విభాగాల్లో సుస్థిర కెరీర్ సొంతమవుతుంది. దాంతోపాటు ప్రణాళిక సంఘం, సెన్సస్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించే విభాగాల్లో.. వాస్తవ పరిస్థితులపై సర్వేలు నిర్వహించేందుకు స్టాటిస్టీషియన్ల అవసరం ఎంతో ఉంది.
మ్యాథ్స్‌పై పట్టుంటే స్టాటిస్టిక్స్ ఎంతో సులభం
స్టాటిస్టిక్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం.. ఈ సబ్జెక్టు అనాసక్తిగా ఉంటుందని భావిస్తుండటమే! వాస్తవానికి మ్యాథమెటిక్స్‌పై పట్టున్న విద్యార్థులు స్టాటిస్టిక్స్‌లో సులభంగానే రాణిస్తారు. మ్యాథమెటిక్స్‌లో రాణిస్తున్న విద్యార్థులు కొంత విభిన్నంగా ఆలోచించి స్టాటిస్టిక్స్‌పై అడుగులు వేస్తే అద్భుతమైన కెరీర్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కాబట్టి మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు.. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే అనే ఆలోచనను వదిలి.. స్టాటిస్టిక్స్‌వైపు దృష్టిసారిస్తే మెరుగైన కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు.
స్టాటిస్టిక్స్... కెరీర్‌లో రాణించాలంటే
వాస్తవానికి స్టాటిస్టిక్స్.. అనువర్తిత ఆధారిత సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్‌లో ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవాలంటే.. అకడెమిక్ స్థాయి నుంచే అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో అడుగులు వేయాలి. పలు విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో పెంచుకోవడంతోపాటు ఆయా విభాగాలపై ప్రాథమిక అవగాహన మెరుగుపర్చుకోవాలి. ఓర్పు, సహనం ఉంటే స్టాటిస్టీషియన్ కెరీర్‌లో ఉత్తమంగా రాణించడం సులభం.
స్టాటిస్టిక్స్ పీజీ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు

- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతా
(ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్ క్యాంపస్‌లు) - ఐఐటీ-బాంబే (ఎమ్మెస్సీ- అప్లయిడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్)
- ఐఐటీ-కాన్పూర్
(ఎమ్మెస్సీ- మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) - బెనారస్ హిందూ యూనివర్సిటీ
(బీఏ ఆనర్స్, ఎంఏ, ఎమ్మెస్సీ) - ఢిల్లీ యూనివర్సిటీ (ఎంఏ, ఎమ్మెస్సీ-స్టాటిస్టిక్స్) మన రాష్ట్రంలో:
- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
- ఆంధ్రా యూనివర్సిటీ
- ఉస్మానియా యూనివర్సిటీ
- కాకతీయ యూనివర్సిటీ
- ద్రవిడియన్ యూనివర్సిటీ
- శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ
Published date : 04 Oct 2013 03:51PM