Skip to main content

వైద్యుల నియామకాల్లో రికార్డు స్థాయిలో 2,072 పోస్టులకు నోటిఫికేషన్

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల నియామకాల్లో 25 ఏళ్ల రికార్డును తిరగరాసింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలను బలోపేతం చేసేందుకు గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎంబీబీఎస్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకాల ప్రక్రియ గురువారంతో ముగిసింది. కరోనా నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కడున్నా ఇబ్బంది లేకుండా ఇంటినుంచే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా అవకాశం కల్పించి నియామక పత్రాలను అందచేశారు. ప్రతిభతోపాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఒక్క వివాదం కూడా లేకుండా ప్రక్రియను ముగించడం గమనార్హం.

సెప్టెంబర్10వ తేదీలోగా విధుల్లోకి కొత్త డాక్టర్లు

  1. తాజా నియామకాలతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రతి కేంద్రానికీ ఇద్దరు డాక్టర్లు చొప్పున వస్తారు. సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు కూడా బలోపేతం కానున్నాయి. బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ సేవలు భారీగా పెరగనున్నాయి.
  2. ఎంబీబీఎస్ అర్హత కలిగిన డాక్టర్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తారు.
  3. పీజీ డిప్లొమా లేదా పీజీ చదివి వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి వచ్చినవారు సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌లుగా పనిచేస్తారు.
  4. పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ అర్హతతో వైద్యవిద్యాశాఖలో చేరిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా వ్యవహరిస్తారు. ఈనెల 10లోగా అందరూ విధుల్లో చేరతారు.
  5. మొత్తం 2,072 పోస్టులకు గానూ తాజా నియామకాల్లో 1,339 మంది చేరారు. మిగతా పోస్టులకు వారం తరువాత మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
  6. ఇంటి నుంచే కౌన్సెలింగ్, మెయిల్ ద్వారా నియామక పత్రాలు జారీ చేయడం ఇదే తొలిసారి.
  7. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో మొత్తం 48 స్పెషాలిటీల్లో నియామకాలు చేపట్టారు.

పోస్టుల వారీగా నియామకాలు
..

విభాగం

పోస్టులు

నియామకాలు

గైర్హాజరు/ ఆప్షన్ తీసుకోనివారు

ప్రజారోగ్యశాఖ

645

495

150

వైద్యవిద్యాశాఖ

735

543

192

వైద్యవిధాన పరిషత్

692

301

391


ఇబ్బంది లేకుండా కౌన్సెలింగ్..
వందల్లో కాదు .. వేలల్లో డాక్టర్ పోస్టుల నియామకాలు సజావుగా జరిగాయి. మెరిట్ విషయంలోగానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌లోగానీ ఎక్కడా చిన్న లోపం కూడా లేకుండా ప్రక్రియ పూర్తికావడం గొప్ప విషయం. అభ్యర్థులకు ఇంటి నుంచే కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించి నియామకాలు పూర్తి చేయడం మరో రికార్డు’
- డాక్టర్ రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధానపరిషత్

Published date : 04 Sep 2020 02:14PM

Photo Stories